శకుంతలాదేవిగా 'విద్యాబాలన్'
- September 16, 2019
బాలీవుడ్ లో మరో బయోపిక్ తెరకెక్కనుంది. నేడు లండన్ లో మ్యాథమెటికల్ జీనియస్ `శకుంతలాదేవి` బయోపిక్ ప్రారంభమైంది. ఇందులో టైటిల్ పాత్రలో నటి విద్యాబాలన్ నటిస్తుంది. ప్రారంభోత్సవం సందర్భంగా బాలన్ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడింది. "ఈ కొద్ది నెలల గ్యాప్ లో నా గురించి నేను తెలుసుకున్నా. మ్యాథ్స్ లో ఇంత గొప్ప మేధావి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను. హ్యూమన్ కంప్యూటర్ అన్న పేరు శకుంతలకు ఎలా వచ్చిందో తెలుసుకున్నా. ఆ తర్వాత ఆ పాత్రపై మక్కువ పెరిగింది. ఈ కథను ఇష్టపడడానికి కారణం పాత్ర స్వభావం. అయస్కాంతం లాంటి ఆకర్షణ కలిగి ఉన్న పాత్ర ఇది. తన జీవితం ఎంత ప్రభావవంతమైంది అన్నది ఆకర్షించింది అని బాలన్ పేర్కొంది. `శకుంతలా దేవి` ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. సింపుల్ బాబ్డ్ హెయిర్ స్టైల్.. ఎరుపు రంగు చీరలో శకుంతలా దేవిగా విద్యా చాలా అందంగా కనిపించింది. మహిళా దర్శకురాలు అను మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!