మంచు లక్ష్మి సరికొత్త షో!! సెలెబ్రిటీలను బెడ్ రూమ్ విషయాలను కూడా అడిగేస్తుందిట!!
- September 16, 2019


సెలబ్రిటీస్ అంటే చాలామంది ఇష్టపడతారు. సినిమాల్లోనో లేక టీవీల్లోనో వాళ్లను చూసి అభిమానిస్తుంటారు. తమ అభిమాన తారలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏం చేస్తుంటారా? అని ఆలోచిస్తుంటారు. మామూలుగా పగటి పూట ఏం చేస్తుంటారనేది చాలా వరకూ తెలిసిపోతుంటాయి. కానీ సెలబ్రిటీస్ నైట్ లైఫ్ ఎలా ఉంటుంది?. వాళ్లు బెడ్ పైకి చేరిన తర్వాత వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉంటుంది. ఆ రోజంతా వారికి ఎలా గడిచింది?... ఇలాంటి అంశాలతో పాటు.. ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పని, తెలియని విషయాలను కూడా తెలసుకోవాలనుకునే అభిమానులు చాలానే ఉంటారు. అలాంటి వారికోసం బాలీవుడ్‌లో ఫీట్ అప్ విత్ స్టార్స్ అంటూ ఓ క్రేజీ షో వస్తోంది. కాస్త ఫన్, క్రేజీ, ఇంకాస్త హాట్ గా ఉండే ఎన్నో విషయాలను వాళ్లు ఈ `ఫీట్ అప్ విత్ స్టార్స్`లో షేర్ చేసుకుంటుంటారు. ఇప్పుడు తెలుగులోనూ అలాంటి స్పైసీ షో రాబోతోంది. మంచు లక్ష్మి హోస్ట్‌గా ఈ షో త్వరలోనే తెలుగులో ప్రసారం కాబోతోంది. సింపుల్ గా చెబితే వీటిని 'బెడ్ టైమ్ స్టోరీస్'అనుకోవచ్చు. లేదా బెడ్ టైమ్ ఇంటర్వ్యూ అని కూడా అనుకోవచ్చు. మంచు లక్ష్మి ఈ షోను మరింత క్రేజీగా హోస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వయాకామ్ 18వాళ్లు ఈ షోను నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ "ఫూట్ అప్ విత్ స్టార్స్ తెలుగు వెర్షన్ హోస్ట్ చేస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నారు. ఈ షో ఫార్మాట్ చాలా యూనిక్ గా ఉంది. మన అభిమాన సెలబ్రిటీస్ ఫీలింగ్స్‌ను, సీక్రెట్స్‌ను తెలుసుకునేందుకు ఇది ఓ పర్ఫెక్ట్ సెట్టింగ్. తమ అభిమాన తారలను అభిమానులకు చాలా దగ్గరగా చేస్తూ చాలా ఫన్‌గా ఈ షో ఉండేలా ప్రయత్నిస్తాను. సెలబ్రిటీస్‌లో నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.. వాళ్లందరితోనూ చేసే సంభాషణల కోసం నేనూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నాను" అన్నారు.
"ఈ నెల 23 నుంచి ప్రారంభం కాబోతోన్న ఈ షోకోసం ఇప్పటికే చాలామందికి నచ్చే తారలతో ఇంటర్యూస్ సిద్ధంగా ఉన్నాయని.. ఇలాంటి సెన్సేషనల్ షో అందరికీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాం" అని వయాకామ్ 18 ప్రతినిధులు చెప్పారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







