అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు..సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం
- September 17, 2019
అమరావతి : టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఆదేశాలిచ్చారు. కాగా, కోడెల శివప్రసాదరావు పార్థీవ దేహాన్ని హైదరాబాద్ నుంచి నరసరావుపేటకు తరలిస్తున్నారు. కార్యకర్తల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఈ మధ్యాహ్నం గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఉంచనున్నారు. సాయంత్రం నరసరావుపేటలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. సోమవారం హైదరాబాద్‌లో అనుమానాస్పదరీతిలో కోడెల శివప్రసాదరావు మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







