ప్రధాని పుట్టినరోజు శోభ
- September 17, 2019
సెప్టెంబర్ 17వ తేదీ తన 69వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు వెళ్లారు. సర్దార్ సరోవర్ డ్యాం వద్ద ఉన్న నర్మద దేవతకు చేసిన పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న నమామీ దేవీ నర్మదె మహోత్సవాల్లో భాగంగా గుజరాత్ ముఖ్య మంత్రి విజయ రూపాణీతో కలిసి మోడీ పాల్గొన్నారు.
ఆ తర్వాత కెవాడియాలో ఉన్న బటర్ ఫ్లై గార్డెన్‌కు వెళ్లారు. అక్కడ కాషాయ రంగులో ఉన్న సీతాకోకచిలుకను రాష్ట్ర సీతాకోక చిలుకగా ప్రకటించారు. పర్యటనలో భాగంగా ముందు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్టాట్యూ ఆఫ్ యూనిటీని సందర్శించారు. 138.68మీటర్ల ఎత్తులో ఉన్న రిజర్వాయర్‌కు నిండుగా నీళ్లు రావడంతో అక్కడ జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొన్నారు.
2017 తర్వాత నీటి స్థాయి పెంచాక రిజర్వాయర్ నిండుకోవడం ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రితో కలిసి నర్మదా నీటికి స్వాగతం తెలిపారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీని ఓ టూరిజం స్పాట్‌గా తీర్చి దిద్దాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన ప్రాజెక్టులను పరిశీలించారు. పర్యాటకులకు కనువిందు చేసేందుకు బోట్ ప్రయాణం, బటర్ ఫ్లై పార్క్, ఏక్తా నర్సరీలు ఏర్పాటుచేశారు. ఆ తర్వాత నర్మదా ఒడ్డున ఉన్న గరుడేశ్వర్ గ్రామంలోని దత్త్ మందిర్‌ను సందర్శించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







