కౌశల్ ని ఇంకా ఆ భ్రమ వదిలినట్టులేదు!
- September 17, 2019
బిగ్ బాస్ రెండో సీజన్ లో విజేతగా నిలిచిన కౌశల్ అప్పట్లో సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే. అతడి కోసం ఆర్మీ తయారై.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన కౌశల్ తనకు పీఎం ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిందని, డాక్టరేట్ రాబోతుందని గొప్పలు చెప్పి నవ్వులపాలయ్యాడు.
ఇక అతడు ఆర్మీ కూడా ఫేక్ ఆర్మీ అంటూ ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. కౌశల్ ఆర్మీ ద్వారా ఏర్పాటైన ఫౌండేషన్ కోసం సేకరించిన నిధులను దుర్వినియోగం చేసినట్లు వార్తలు వచ్చాయి. కౌశల్ ఆర్మీని నడిపించిన కొందరు అభిమానులు మీడియాకెక్కి కౌశల్ ఫ్రాడ్ అంటూ ఆరోపణలు చేసి వివాదానికి తెరలేపారు.
ఆ సమయంలో కౌశల్ పేరు మీడియాలో మార్మోగింది. ఇప్పుడు మరోసారి కౌశల్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన ఒక ఈవెంట్ లో పాల్గొన్న కౌశల్ ని మీడియా ప్రతినిధి ఓ ప్రశ్న అడిగారు.
బిగ్ బాస్ సీజన్ 3 టాప్ కంటెస్టంట్ల పేర్లు చెప్పాలని రిపోర్టర్ అడగగా.. ''నేను ఇప్పుడు ఒకరి పేరు చెబితే నా ఆర్మీ మొత్తం వారికే సపోర్ట్ చేస్తుంది. అప్పుడు మిగిలిన వారికి అన్యాయం జరుగుతుందని'' చెప్పారు. ఈ విషయంలో నెటిజన్లు కౌశల్ ని ఏకిపారేస్తున్నారు. ఇంకా నీ ఆర్మీ ఉందా..? అంటూ సెటైర్లు వేస్తున్నారు. కౌశల్ ఇంకా అదే భ్రమలో ఉన్నాడని విమర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







