కోడెల మృతి: దుమారం లేపుతున్న ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
- September 17, 2019
అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ది రాజకీయ హత్య అని ఆరోపించారు ఏపీ మంత్రి కొడాలి నాని. తనను నమ్ముకొన్న పార్టీ, అధినేత దూరం పెట్టడంతో అవమానంతో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కోడెల శివప్రసాద్‌ను ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని 3 నెలలో ఎందుకు చంద్రబాబు మీడియా ముఖంగా చెప్పలేదని ప్రశ్నించారు. కోడెల, అతని కుమారుడు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మీపై కేసు పెట్టింది బాధితులేనని స్పష్టంచేశారు. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ కేసులు నమోదు చేయలేదని తేల్చిచెప్పారు.
నమ్మినవారే
తనను నమ్ముకొన్న పార్టీ, అధినేత చంద్రబాబు నాయుడు దగ్గరకు రానీయడం లేదని.. ఆ అవమాన భారంతోనే కోడెల శివప్రసాద్ బలవన్మరణానికి పాల్పడ్డారని మంత్రి కొడాలి నాని తెలిపారు. నమ్మిన పార్టీ, కుటుంబం పెద్ద లాంటి అధినేత దూరం పెడితే ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేక .. ఈ లోకంలో ఉండలేక ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటారన్నారు. ఓ నేతగా వెన్నంటే ఉంటే మీరిచ్చిన గౌరవం అదీ అని చంద్రబాబును ప్రశ్నించారు నాని. గత ప్రభుత్వంలో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినా.. నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినా ... అనర్హత వేటు వేయకుండా స్పీకర్ స్థానానికి కోడెల శివప్రసాద్ న్యాయం చేయలేకపోయారని చెప్పారు.
ఎప్పుడూ మోసం, వంచనే
అప్పుడే కాదు ఎప్పుడు మీ వెన్నంటే ఉన్న కోడెలను మీరు దారుణంగా అవమానించారని తెలిపారు. పార్టీలో కొందరి చేత కోడెల శివప్రసాద్ తప్పుచేశారని మాట్లాడించారని ఆరోపించారు. వర్ల రామయ్య లాంటి వ్యక్తులతో పార్టీ కార్యాలయంలో మాట్లాడించి .. కోడెలను ఒంటరి చేసింది మీరు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు కొడాలి నాని. అంతేకాదు శాసనసభ ఫర్నీచర్‌కు సంబంధించి ఏ చర్య తీసుకున్నా తాము కాదనబోమని ఓ పత్రికలో చంద్రబాబు పేరుతో వచ్చిన వార్తను చదివి వినిపించారు కొడాలి నాని. కోడెల శివప్రసాద్‌ను చంద్రబాబు దారుణంగా అవమానించారు. అందుకోసమే ఆయన అవమాన భారాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు.
అవమానాలు
గతంలో కూడా కోడెల శివప్రసాద్‌ను చంద్రబాబు నాయుడు అవమానించారని గుర్తుచేశారు ఏపీ మంత్రి కొడాలి నాని. 1999లో కోడెల ఇంట్లో బాంబు పేలిందని విచారణ చేయించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. తర్వాత కోడెల కన్నా జూనియర్ అయిన ఆళ్లపాటికి మంత్రి పదవీ ఇవ్వలేదా ? అని నిలదీశారు. పుట్టి పెరిగిన నరసరావుపేటను కాదని సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలని ఒత్తిడి చేసింది మీరు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు.
మంత్రి పదవీ కాదని ..
2014లో ఎమ్మెల్యేగా గెలిచాక మంత్రి పదవీ ఇవ్వాలని కోడెల కోరితే .. స్పీకర్ పదవీ కట్టబెట్టింది మీరు కాదా అని కొశ్చన్ చేశారు. స్పీకర్ చేత చేయించాల్సిన పనులన్నీ చేయించలేదా అని నిలదీశారు. 2019లో సత్తెనపల్లి నుంచి ఓడిపోయాక .. అక్కడ ఇంచార్జీ తీసింది మీరు కాదా .. నియోజకవర్గానిక వెళితే చాలు మీ శ్రేణులతో ఆందోళన చేయించలేదా అని కొడాలి చంద్రబాబు ప్రశ్నాస్త్రాలు సంధించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







