ఎల్ఐసీలో 8500 పైగా అసిస్టెంట్ ఉద్యోగాలు... డిగ్రీ పాసైతే చాలు
- September 17, 2019
నిరుద్యోగులకు శుభవార్త. భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC. దేశవ్యాప్తంగా 8500 పైగా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 276 పోస్టులున్నాయి. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ చూడొచ్చు. ఈస్ట్ సెంట్రల్ జోన్ తప్ప మిగతా అన్ని జోన్లకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. సెంట్రల్, ఈస్టర్న్, ఈస్ట్ సెంట్రల్, నార్తర్న్, నార్తర్న్ సెంట్రల్, సదరన్, సౌత్ సెంట్రల్, వెస్టర్న్ జోన్లకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 1 చివరి తేదీ. అసిస్టెంట్ పోస్టుల కోసం ఎల్ఐసీ జారీ చేసిన నోటిఫికేష్ వివరాలకు దరఖాస్తు చేయడానికి
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 సెప్టెంబర్ 17 దరఖాస్తుకు చివరి తేదీ: 2019 అక్టోబర్ 1
ఆన్‌లైన్ ఫీజు పేమెంట్: 2019 సెప్టెంబర్ 17 నుంచి 2019 అక్టోబర్ 1 వరకు
దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ: 2019 అక్టోబర్ 1
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 2019 అక్టోబర్ 22
విద్యార్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. వయస్సు: 18 నుంచి 30 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయస్సు నిబంధనల్లో సడలింపు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.85+జీఎస్టీ+ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఇతరులకు రూ.510+జీఎస్టీ+ట్రాన్సాక్షన్ ఛార్జెస్.
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్.
వేతనం: బేసిక్ పే, అలవెన్సులు కలిపి సుమారు రూ.30,000
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







