బిగ్ బీ ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీ ఇచ్చిన కళ్ళుచెదిరే గిఫ్ట్!
- September 18, 2019
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. భారీ ఖర్చుతో, క్యాస్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతానికి ఈ సినిమాలో ప్రముఖ విషయం ఏదన్నా ఉందంటే అది.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో నటించడమే. చిరంజీవి - అమితాబ్ కు సంబంధించి ఇప్పుడో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అమితాబ్ కుటుంబానికి చిరంజీవి కుటుంబం ఖరీదైన బహుమతి ఇచ్చిందనేది వార్త.
'సైరా.. సినిమా చిరంజీవితో ఉన్న ఫ్రెండ్ షిప్ తో చేస్తున్నాను' అని అమితాబ్ ఇదివరకే తెలిపారు. 'సైరాలో నటించినందుకు అమితాబ్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. స్పెషల్ ఫ్లైట్ కానీ, చార్జెస్ కానీ పెట్టనివ్వలేదు' అని చిరంజీవి, చరణ్ గతంలోనే చెప్పారు. చిరంజీవిపై అమితాబ్ చూపిన అభిమానానికి, సైరా సినిమా గుర్తుగా చిరంజీవి కుటుంబం బచ్చన్ సాబ్ కి భారీ గిఫ్ట్స్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ సమాచారం. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఖరీదైన జ్యువెలరీని అమితాబ్, జయా బచ్చన్, ఐశ్వర్యారాయ్ కి బహుకరించినట్టు తెలుస్తోంది. మెగా - బిగ్ బీ కుటుంబాల మధ్య ఉన్న మెగా బాండింగ్ ఇది సంకేతమని ఈ వార్త విన్న మెగా అభిమానులు సంబర పడిపోతున్నారు.
ఈరోజు సాయంత్రం విడుదల కాబోతున్న సైరా ట్రైలర్ తో సినిమా ప్రమోషన్లు భారీగా మొదలుకానున్నాయి. టీజర్ తో దుమ్ము రేపిన సైరా.. ట్రైలర్ తో అంచనాలు ఎంత పెంచుతుందో చూడాలి. సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసే థియేటర్ల లిస్టు ఇప్పటికే విడుదల చేసారు . అన్ని పనులు పూర్తి చేసి అక్టోబర్ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు నిర్మాత చరణ్.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







