హైదరాబాద్-కర్ణాటక పేరు మారింది.. ఇకపై..
- September 18, 2019
హైదరాబాద్-కర్ణాటక పేరు మారింది. ఆ ప్రాంతానికి కళ్యాణ కర్ణాటక అని కొత్త పేరు పెట్టారు. ఈ మేరకు కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక నిర్ణయం ప్రకటించారు. బుధవారం నుంచి హైదరాబాద్-కర్ణాటక రీజియన్‌ను కళ్యాణ కర్ణాటక రీజియన్‌గా వ్యవహరించాలని సూచించారు. కళ్యాణ కర్నాటక రీజియన్‌లో ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కర్నాటకలో 6 రీజియన్‌లు ఉన్నాయి. బెంగళూరు, ఉత్తర కర్నాటక, కోస్తా కర్ణాటక, పాత మైసూరు, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాలుగా విభజించారు. ఇందులో హైదరాబాద్-కర్ణాటక చాలా కీలకం. ఈ రీజియన్‌లో బీదర్, గుల్బర్గా, యాద్గిర్, రాయ్‌చూర్, కొప్పళ్, బళ్లారిలతో కూడిన ఈ ప్రాంతం ఒకప్పుడు నిజాం రాజ్యంలో భాగంగా ఉండేది. స్వాతంత్య్రానంతరం కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ ఈ ఆరు జిల్లాలను మాత్రం హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంగానే పిలుస్తున్నారు. దశాబ్దాల ఆ పిలుపునకు యడియూరప్ప సర్కారు చరమగీతం పాడింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







