యూఏఈలో మూడు రోడ్ల మూసివేత

యూఏఈలో మూడు రోడ్ల మూసివేత

అబుదాబీలోని మూడు రోడ్లు పాక్షికంగా, పూర్తిగా మూసివేస్తున్నారు. మెయిన్‌టెన్స్‌ వర్క్‌ కోసం ఈ రోడ్లను మూసివేస్తున్నట్లు అధికారులు వివరించారు. అల్‌ అయిన్‌లోని నహ్యాన్‌ అల్‌ అవ్వాల్‌ స్ట్రీట్‌ సెప్టెంబర్‌ 20 నుంచి, సెప్టెంబర్‌ 21వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు అబుదాబీ ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సెంటర్‌ పేర్కొంది. సుల్తాన్‌ బిన్‌ జాయెద్‌ - ది ఫస్ట్‌ స్ట్రీట్‌ సెప్టెంబర్‌ 19 నుంచి సెప్టెంబర్‌ 21 వరకు మూసివేస్తారు. అల్‌ ఖలీజ్‌ అల్‌ అరాబి స్ట్రీట్‌ సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు మూసివేయనున్నారు.

Back to Top