వాహనాల దొంగతనం కేసులో 10 మంది అరెస్ట్‌

వాహనాల దొంగతనం కేసులో 10 మంది అరెస్ట్‌

మస్కట్‌: ఒమన్‌లో వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న 10 మంది వ్యక్తుల్ని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. కీస్‌ని రీ-ప్రోగ్రామింగ్‌ చేయడం ద్వారా నిందితులు వాహనాల్ని దొంగిలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వాహనాల నిర్వహణలో వాహనదారులు అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచించారు. కార్ల దొంగతనాలకు సంబంధించి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో అత్యంత పకడ్బందీగా ఆపరేషన్‌ నిర్వహించి 10 మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నామని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

 

Back to Top