నాగార్జున పొలంలో డెడ్ బాడీ..కలకలం రేపుతున్న ఘటన

నాగార్జున పొలంలో డెడ్ బాడీ..కలకలం రేపుతున్న ఘటన

హీరో నాగార్జున పొలంలో మృతదేహం కలకలం రేపుతోంది. షాద్ నగర్ మండలంలోని పాపిరెడ్డి గూడలో నాగార్జున కొనుగోలు చేసిన 40 ఎకరాల వ్యవసాయ భూమిలో మృతదేహం లభ్యమైంది. ఈనెల 10న వ్యవసాయ క్షేత్రంలో నాగార్జున, అమల చెట్లు నాటారు. వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేశారు నాగార్జున కుటుంబ సభ్యులు.

ఈమేరకు వ్యవసాయసాగుపై నిపుణులను పంపించారు. పొలంలోకి వెళ్లిన నిపుణులు ఒక ప్రాంతంలో ఉన్న గదిలో కుళ్లిపోయిన మృతదేహన్ని గుర్తించారు. దీంతో స్థానికులు, నిపుణులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గదిని సీజ్‌ చేసిన పోలీసులు అక్కడే పోస్ట్ మార్టమ్ నిర్వహించాలని నిర్ణయించారు. చనిపోయిన వ్యక్తి ఎవరన్న దానిపైన ఆరా తీస్తున్నారు.

Back to Top