సూర్యుణ్ణి అధ్యయనం చేయనున్న ఆదిత్య-ఎల్‌1

సూర్యుణ్ణి అధ్యయనం చేయనున్న ఆదిత్య-ఎల్‌1

హైదరాబాద్‌: ఇస్రో మరో అద్భుత ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నది. సూర్యుడి అధ్యయనం కోసం ఆదిత్య-ఎల్‌1 ప్రయోగాన్ని చేపట్టనున్నది. 2020లోగా ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇస్రో భావిస్తున్నది. దీనికి సంబంధించిన తుది తేదీలు ఇంకా వెల్లడికాలేదు. తొలిసారి భారత్ ఆదిత్య-ఎల్‌1 ద్వారా సూర్యుడిని స్టడీ చేయనున్నది. సుమారు 400 కేజీల బరువుతో శాటిలైట్‌ను తయారు చేస్తున్నారు. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ పేలోడ్‌ను భూకక్ష్యలో ప్రవేశపెడుతారు. భూమికి సుమారు 15 లక్షల మైళ్ల దూరంలో ఉన్న లగ్‌రంగియన్ (ఎల్‌1) పాయింట్ వద్ద శాటిలైట్‌ను నిలుపనున్నారు. ఆదిత్య-ఎల్‌1తో సూర్యుడి బహ్యాప్రదేశాన్ని అధ్యయనం చేయనున్నారు. లక్షల డిగ్రీల కెల్విన్ల ఉష్ణోగ్రత ఉండే కరోనాను ఆదిత్య స్టడీ చేస్తుంది. సూర్యుడికి సంబంధించిన ఫోటోస్పియర్‌, క్రోమోస్పియర్‌లను కూడా ఆదిత్య అధ్యయనం చేయనున్నది. సౌర శాస్త్రానికి సంబంధించిన ఇంకా అనేక పరిశోధనలను ఆదిత్య చేపట్టనున్నది.

Back to Top