రికార్డుల వేటలో 'సైరా'
- September 19, 2019
మెగాస్టార్ చిరంజీవి రికార్డుల వేట మొదలైంది. నిన్న రిలీజైన చిరంజీవి సినిమా సైరా ధియేట్రికల్ ట్రైలర్ కి సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మూడు నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ నిన్న సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు రిలీజైంది. తెలుగుతో పాటు సినిమా రిలీజ్ అవుతున్న తమిళ, మలయాళ, కన్నడ, హిందీ బాషల్లో సైరా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. యూట్యూబ్ తో పాటు మిగతా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ మీద సైరా ట్రైలర్ కి మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. కేవలం 24 గంటల్లో సైరా ట్రైలర్ కి అన్ని బాషల్లో కలిపి 34 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
చిరంజీవి కెరీర్లో ఇదొక రికార్డ్. టాప్ లిస్ట్ లోనూ తెలుగులో మొదటి మూడు స్థానాల్లో ఉంటుంది ఈ రికార్డ్. దీని బట్టే సైరా కోసం ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారనేది అర్ధం చేసుకోవచ్చు. తెలుగు వెర్షన్ ట్రైలర్ కి వచ్చినంతగా, హిందీ ట్రైలర్ కి కూడా దాదాపు అంతే రెస్పాన్స్ రావడం హైలైట్ గా చెప్పాలి. ఇక తమిళ, కన్నడ వెర్షన్ల ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మలయాళంలో మాత్రం ఫరవాలేదనిపిస్తోంది. ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్ చూస్తే…అక్టోబర్ 2న వస్తున్న సినిమాకి ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ వస్తాయో అని ట్రేడ్ వర్గాలు లెక్కలేస్తున్నాయి. ఇక ట్రైలర్ లో చూపించిన ఇంటెన్స్, యాక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాగ్రౌండ్ స్కోర్, డైలాగ్స్…సైరాపై అంచనాలు పెంచుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







