84 ఏళ్ళ యువకుడి స్కై డైవింగ్‌

84 ఏళ్ళ యువకుడి స్కై డైవింగ్‌

దుబాయ్‌:84 ఏళ్ళ వయసులో స్కై డైవింగ్‌ చేసిన వ్యక్తిని వృద్ధుడు అనలేం.. శారీరకంగా ఆయన వృద్ధుడే కావొచ్చుగానీ, మానసికంగా ఆయన యువకుడే. దుబాయ్‌లో 84 ఏళ్ళ సుషీల్‌ కుమార్‌, ధనం కంటే తాను ఎన్నో గొప్ప గొప్ప విషయాల్ని నమ్ముతానని చెప్పారు. విమానం నుంచి గాల్లోకి దూకి, స్కై డైవింగ్‌ చేశారాయన. ఇండియాలోని బెంగళూరుకి చెందిన సుశీల్‌ కుమార్‌, హాలీడేయింగ్‌ కోసం దుబాయ్‌కి వచ్చారు. స్కై డైవ్‌ దుబాయ్‌ దీనికి సంబంధించి ఓ వీడియో షేర్‌ చేసింది. ఈ అనుభవం చాలా ప్రత్యేకమైనదనీ, ఇలాంటి సాహసాలు చేయడాన్ని తాను ఇష్టపడ్తానని సుషీల్‌ చెప్పారు.  

Back to Top