సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో 'నాగసౌర్య' సినిమా
- September 19, 2019
ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ 8వ చిత్రాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. యువ కథానాయకుడు 'నాగసౌర్య' హీరోగా పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా 'లక్ష్మి సౌజన్య' దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు అని తెలియపరచటం సంతోషంగా ఉందని అన్నారు నిర్మాత. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు మరి కొద్ది రోజుల్లో ప్రకటించటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 'మే' నెలలో విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..