అమెరికాలో మరోసారి కాల్పులు..
- September 20, 2019
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. వాషింగ్టన్ డీసీలోని ఓ వీధిలో ఆగంతకుడు జనంపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
కాల్పుల ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కాల్పుల్లో ఉగ్రవాద కోణంపై ఆరా తీస్తున్నారు. సమీప వీధులను ఖాళీ చేయించి దుండగుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో కాల్పులు స్థానికులను ఉలిక్కిపడేలా చేశాయి.
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైట్ హౌస్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







