గద్దలకొండ గణేష్ సినిమా ట్విట్టర్ రివ్యూ

- September 20, 2019 , by Maagulf
గద్దలకొండ గణేష్ సినిమా ట్విట్టర్ రివ్యూ

మెగాఫ్యామిలీకి చెందిన హీరోల్లో సినిమా సినిమాకి వేరియేషన్ చూపించే హీరోల్లో వరుణ్ తేజ్ ముందుంటాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి క్లాస్, మాస్ అనే బోర్డర్స్ పెట్టుకోకుండా సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తున్నాడు వరుణ్. అదే బాటలో ఇప్పుడు వాల్మీకి సినిమా చేశాడు. తమిళంలో హిట్ అయిన జిగర్తాండ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్షన్లో రీమేక్ చేశారు.

ఈ మూవీలో వరుణ్ లుక్ దగ్గరనుంచి, క్యారెక్టర్ వరకు అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ మూవీని నిర్మించారు. వరుణ్ కి జోడిగా పూజాహెగ్దే నటించింది. తమిళ నటుడు అధర్వా కీలక పాత్ర పోషించారు. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com