ఆస్కార్ అవార్డు ఎంట్రీలోకి డియర్ కామ్రేడ్

- September 21, 2019 , by Maagulf
ఆస్కార్ అవార్డు ఎంట్రీలోకి డియర్ కామ్రేడ్

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి విదితమే. బాక్స్ ఆఫీసుల దగ్గర కూడా కాసులను కొల్లగొట్టింది.

తాజాగా ఆ మూవీకి మరో అరుదైన ఘనత దక్కింది. ఈ మూవీకి ఆస్కార్ ఎంట్రీ లిస్టులో చోటు దక్కింది . దీంతో పాటు ఇండియా నుండి మొత్తం ఇరవై ఎనిమిది సినిమాలు చోటు దక్కించుకున్నాయి.

ఎంట్రీ లిస్టులో చోటు దక్కించుకున్న ఏకైక తెలుగు మూవీగా డియర్ క్రామేడ్ నిలిచింది. చోటు దక్కించుకున్న ఈ ఇరవై ఎనిమిది చిత్రాలను స్క్రీనింగ్ చేసి వాటిలో మంచి మూవీని ఎంపిక చేసి.. దాన్ని బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరిలో ఆస్కార్ కు పంపుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com