మోహన్ లాల్ పై కేసు నమోదు
- September 21, 2019
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పై కేసు నమోదైంది. కేరళ అటవీ శాఖ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. చార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఏనుగు దంతపు కళాఖండాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నందుకు మోహన్ లాల్ పై ఈ క్రిమినల్ కేసుకు నమోదైంది. ముందస్తు అనుమతి లేకుండా ఏ వ్యక్తి అయినా ప్రభుత్వ ఆస్తిని కలిగి ఉండటాన్ని వన్యప్రాణుల రక్షణ చట్టం నిషేధిస్తుంది.
2012కు చెందిన ఈ కేసులో పోలీసులు మోహన్ లాల్ నివాసం నుంచి అనేక దంతపు కళాఖండాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రక్షణ చట్టంలోని సెక్షన్ 39 (3) కింద మోహన్ లాల్ పై కేసు నమోదు చేసినట్లు చార్జిషీట్ సూచిస్తోంది. ప్రభుత్వ సంపదను ఎలాంటి అనుమతులు లేకుండా ఇంట్లో పెట్టుకున్నారనే నేరంపై దాఖలైన ఈ చార్జ్ షీట్ పై విచారణ జరిగితే.. మోహన్ లాల్ చిక్కుల్లో పడ్డట్టేనని చెబుతున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







