మోదీ పర్యటన ట్రంప్ కు లాభమేనా?
- September 22, 2019
అమెరికా-భారత్ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడమే… హోడీ -మోదీ కార్యక్రమం ఉద్దేశం. వర్తక-వాణిజ్య పరంగా ఇటీవలి కాలంలో అమెరికా-భారత్ మధ్య సంబంధాలు కొద్దిగా దెబ్బతిన్నాయి. గత ఏడాది భారత్ నుంచి వచ్చే అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు పెంచింది. జీఎస్పీ హోదాను రద్దు చేసి కొన్ని ఉత్పత్తులకు ఇస్తున్న జీరో టారిఫ్ ప్రయోజనాన్ని నిలిపేసింది. ప్రతిగా భారత ప్రభుత్వం అమెరికన్ వస్తువులపై టాక్స్‌లు పెంచింది. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న బాదం, వాల్నట్స్ సహా 28 రకాల ఉత్పత్తులపై జూలై నెల నుంచి టారిఫ్‌లను పెంచింది. దీంతో ఇరు దేశాల మధ్య టాక్స్ వార్ ఏర్పడింది. ఇలాంటి సమయంలో ఇద్దరు అధినేతలు ఒకే వేదికను పంచుకోవడం వల్ల 2 దేశాల మధ్య వాణిజ్య రంగంలో విభేదాలు సమసిపోతాయని అంటున్నారు..
ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య వాణిజ్యంలో కీలక ఒప్పందాలను ఖరారు చేసుకునే అవకాశం ఉంది. అంతే కాదు అమెరికాతో చమురు ఒప్పందం చేసుకునే అవకాశం కూడా ఉంది. భారత్‌లో చమురుకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల తరువాత అక్కడ నుంచి చమురు ఎగుమతులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో చమురు కోసం భారత్ మరో దేశంపై ఆధారపడాల్సిన పరిస్థితి. అందుకే అమెరికాతో ఇంధనం ఒప్పందం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా హ్యూస్టన్‌లో 16 చమురు కంపెనీ సీఈవోలతో మోదీ సమావేశం కానున్నారు..
అటు ట్రంప్ కు లాభం చేకూర్చేలా మోదీ పర్యటన ఉందంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ట్రంప్ విషయానికొస్తే 2020 నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్లు.. ట్రంప్ రాజకీయ భవితవ్యానికి నిర్దేశించే అవకాశాలున్నాయి. టెక్సాస్ లాంటి రాష్ట్రాల్లో డెమొక్రాట్ల ప్రాబల్యం ఎక్కువ. ఇండియన్ అమెరికన్లలో చాలామంది డెమొక్రాట్ అభ్యర్థుల వైపే మొగ్గు చూపుతున్నారు. వీరిని తన రిపబ్లికన్ వైపు తిప్పుకునేందుకు ట్రంప్‌కు ఈ ఈవెంట్ ఎంతోగానో ఉపయోగపడే అవకాశం ఉంది..
ఇటు మోదీ సైతం.. ఈ టూర్‌తో తన ప్రతిష్టను మరింత పెంచుకోనున్నారు. భారత్, అమెరికా మధ్య బంధం రాజకీయ, దౌత్య, వ్యక్తిగతాలను దాటి ముందుకెళ్లిందంటున్నారు అంత ర్జాతీయ విశ్లేషకులు. హౌడీ-మోదీ మీటింగ్‌తో మోదీ-ట్రంప్ బంధం మరో లెవల్‌కు వెళ్తుందని, అది అమెరికా-భారత్ సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి చేరుస్తుందంటున్నారు. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ను ఏకాకి చేయడానికి ఈ పర్యటనను పూర్తిగా వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంలో భారత్‌కు అమెరికా మద్దతిచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి సుమారు వారం రోజుల అమెరికా పర్యటనలో మోదీ… ఇండియాలో తన నాయకత్వానికి తిరుగు లేదని నిరూపించుకోనున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







