హెచ్ -1 బీ వీసాపై ఆ నిర్ణయం భారత ఎన్నారైలకి భారీ ఊరట
- September 22, 2019
ఎట్టకేలకు భారత ఎన్నారైలు చాలా రోజుల తరువాత ప్రశాంతంగా నిద్రపోయి ఉంటారు. గత కొంత కాలంగా హెచ్ -1 బీ వీసా దారులు తమ జీవిత భాగస్వాముల విషయంలో పడుతున్న అందోళనకి కొంత కాలం వరకూ కలవర పడకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఓ కీలక ప్రకటన చేసింది. హెచ్ -4 వీసా రద్దు విషయంలో వచ్చే ఏడాది వరకూ కూడా రద్దు విధించబోమని తెలిపింది.
ఈ విషయంపై అమెరికాలో ఉంటున్న భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విధానం పూర్తిగా ఎత్తి వేస్తే మరింత ఊరట కలుగుతుందని అమెరికా ప్రభుత్వాని కోరుకుంటున్నారు. ఎందుకంటే. అమెరికాలో హెచ్ -4 వీసా ద్వారా ప్రవేశించిన వారిలో అత్యధికులు భారతీయులే. హెచ్ -1 బీ వీసా ఉన్న వారి జీవిత భాగస్వాములని అమెరికాలోకి ప్రవేశించేందుకు వీలుగా ఏర్పాటు చేసినదే హెచ్ -4 వీసా
2015 లో అప్పటి అధ్యక్షుడు ఒబామా హెచ్ -1 బీ వీసా దారులకోసం హెచ్ -4 వీసాని ప్రవేశపెట్టారు. దాంతో అమెరికాలో ఉంటున్న స్థానిక ప్రజలకి ఉద్యోగాలలో తీవ్ర అన్యాయం జరుగుతోందని, వారు తీవ్రంగా నష్టపోతున్నారని ట్రంప్ ప్రభుత్వం ఈ వీసా పై నిషేధం విధించాలని కొన్ని నెలల క్రితం నిర్ణయం తీసుకుని. కానీ డెమోక్రాటిక్ పార్టీ నేతలు, ఎంతో మంది భారతీయుల పై ఆధారపడి నడుస్తున్న సంస్థలు ఆర్జీలు పెట్టడంతో ఈ ఏడాది వరకూ హెచ్ -4 వీసాపై ఎటువంటి నిర్ణయం ఉండదని ప్రకటించింది.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు