ఆర్ధిక సంక్షోభంలో థామస్ కుక్ సంస్థ
- September 23, 2019
లండన్: ప్రముఖ బ్రిటీష్ టూర్ కంపెనీ థామస్ కుక్ ఎయిర్‌వేస్ సంస్థ తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది. సంస్థలో నిధుల ప్రవాహం లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా 600,000 పర్యాటకుల టికెట్లను రద్దు చేసింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న బ్రిటన్ కస్టమర్లు తిరిగి బ్రిటన్‌కు చేరుకునేందుకు ముందస్తుగా థామస్ కుక్ ఎయిర్‌వేస్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇప్పుడు వీరి టికెట్లన్నీ రద్దు కావడంతో ఆయా దేశాల్లోనే నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు. తిరిగి తమ దేశానికి 1,50,000 మంది ప్రయాణికులను తీసుకురావాల్సిన బాధ్యత బ్రిటన్ ప్రభుత్వంపై పడింది.
థామస్‌కుక్
16 దేశాల్లో థామస్‌కుక్ సేవలు
ఇక థామస్ కుక్ ఎయిర్‌వేస్ సంస్థ తమ విమానాలను నిలిపివేయడంతో 16 దేశాల్లో ఈ సంస్థకు పనిచేస్తున్న 21వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు వీధిన పడ్డట్లయ్యింది. ఇందులో యూకేకు చెందిన 9వేలు మంది ఉద్యోగులు ఉన్నారు. బ్రెగ్జిట్‌తో నెలకొన్న డోలాయమానమే తమ సంస్థ సంక్షోభంలోకి వెళ్లేందుకు కారణమైందని థామస్ కుక్ ఎయిర్‌వేస్ యాజమాన్యం గతంలో వెల్లడించింది. 178 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న ఈ పర్యాటక సంస్థ నష్టాల నుంచి గట్టెక్కాలంటే 200 మిలియన్ పౌండ్లు అవసరమవుతాయని వెల్లడించింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కంపెనీ షేర్‌హోల్డర్స్, రుణదాతలతో చర్చలు ప్రారంభించింది. థామస్ కుక్ సంస్థ యూకేలో 600 ట్రావెల్ స్టోర్లను కూడా నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!







