దోహా లో మెడికల్ క్యాంపు పోస్టర్ ను ఆవిష్కరించిన భారత్ రాయబారి

- September 23, 2019 , by Maagulf
దోహా లో మెడికల్ క్యాంపు పోస్టర్ ను ఆవిష్కరించిన భారత్ రాయబారి

ఖతార్:ఇండియన్ కమ్యూనిటీ బెనోవలెంట్ ఫోరం మరియు తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో జరుగబోయే మెడికల్ క్యాంపు పోస్టర్ ను ఆవిష్కరించిన భారత్ రాయబారి  పి.కుమారన్.

తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు సుందరగిరి శంకర్ తెలిపిన వివరాల ప్రకారం 
ఈ నెల 27న అల్లివియా హాస్పిటల్ లో ICBF వారి సౌజన్యంతో ప్రత్యేకంగా కార్మికులు మరియు మత్స్యకారుల కోసం  మెడికల్  క్యాంపు జరుగుతుందని , క్యాంపు లో హాస్పిటల్ వైద్య బృందం కార్మికులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు కూడా ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేశామని తెలిపారు.

ఈ సంద్భంగా ఇండియన్ అంబాసడార్ కుమారన్, ఎంబసీ ప్రధాన కార్యదర్శి  S.ఫేహిం , తో పాటు ICBF అధ్యక్షులు బాబు రాజన్, ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ, ప్రధాన కార్యదర్శి ఆవినాష్ , సహాయ కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారు, రాజినీమూర్తి మరియు తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులు మహేందర్,ఎల్లయ్య, శాంకరచరి పాల్గొన్నారు.
ప్రయాణ సౌకర్యం కలదు.. సంప్రదించవసిన నెంబర్లు..

 #సనయ్యా...77212911,66732459,77651234,66224139
#DOHA    33248542, 70691202, 77883034
#WAKRA 33473690,

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com