దుబాయ్ లో చేయివిరిగి స్వదేశానికి చేరుకున్న కార్మికుడికి ప్రభుత్వ సహాయం

- September 23, 2019 , by Maagulf
దుబాయ్ లో చేయివిరిగి స్వదేశానికి చేరుకున్న కార్మికుడికి ప్రభుత్వ సహాయం

దుబాయ్:దుబాయ్ లో మంచంపై నుండి పడి చేయి విరిగిన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామానికి చెందిన మారంపెల్లి ప్రవీణ్ సోమవారం (23.09.2019) న హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగం పక్షాన ఎయిర్ పోర్టులో ప్రోటోకాల్ సిబ్బంది ప్రవీణ్ కు ఆత్మీయ స్వాగతం పలికారు. హైదరాబాద్ నుండి స్వగ్రామం చేరుకోవడానికి దారి ఖర్చులకు రూ. ఒక వెయ్యి ఆర్ధిక సహాయం చేశారు. 

బతుకుదెరువు కోసం మూడేళ్ళ క్రితం ప్రవీణ్ యూ.ఏ.ఈ దేశంలోని దుబాయ్ కి వలస వెళ్ళాడు. అక్కడి కంపెనీలో సరైన పని, వేతనం లేని కారణంగా  కంపెనీ నుండి బయటకు వెళ్ళిపోయి కల్లివెళ్లి (అక్రమ నివాసి) అయ్యాడు. ఈ సందర్బంగా ప్రవీణ్ మాట్లాడుతూ... తనకు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయించాలని, తమది పేద కుటుంబమని,  తనకు ప్రభుత్వం పునరావాసం  కల్పించాలని కోరారు. దుబాయ్  నుండి హైదరాబాద్ రావడానికి ప్లయిట్ టికెట్, ఇమిగ్రేషన్ ఇతర ఖర్చులు కలిపి రూ. 15 వేల వరకు ఖర్చు  అయిందని, ఇట్టి డబ్బు తెలిసినవారి దగ్గర అప్పు తీసుకున్నానని ముఖ్యమంత్రి సహాయనిధి నుండి తనకు ఆర్ధిక సహాయం చేయాలని ఆయన కోరారు. దుబాయ్లోని సామాజిక సేవకుడు జైత నారాయణ ఇమ్మిగ్రేషన్ పత్రాలు ఇప్పించి స్వదేశం రావడానికి సహకరించాడని, 'ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్' ప్రధాన కార్యదర్శి సయిండ్ల రాజిరెడ్డి తన సమస్యను జగిత్యాల జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసికెళ్లాడని వివరించాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com