`ఉల్లాలా ఉల్లాలా`తో తెలుగులోకి ఎంటరవుతున్న `లవర్స్ డే` ఫేమ్ నూరిన్
- September 23, 2019
మలయాళంలో సంచలనం సృష్టించిన `ఒరు ఆదార్ లవ్` చిత్రం రిలీజ్‌కి ముందు ప్రియా వారియర్‌కి ఎంత పేరు తీసుకొచ్చిందో, రిలీజ్ తర్వాత నూరిన్‌కి అంత పేరు తీసుకువచ్చింది. ఈ చిత్రం తెలుగులో `లవర్స్ డే` పేరుతో అనువాదమైన సంగతి తెలిసిందే. మలయాళంలో ఫుల్ బిజీ అయిన నూరిన్ తెలుగులో చేస్తున్న తొలి చిత్రం `ఉల్లాలా ఉల్లాలా`. సీనియర్ నటుడు సత్యప్రకాశ్ దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ పతాకంపై ఎ.గురురాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు సత్యప్రకాశ్ మాట్లాడుతూ ``ఇదొక వైవిధ్యభరితమైన చిత్రం. రొమాంటిక్ ఎంటర్టైనింగ్ థ్రిల్లర్. ఈ సినిమాలో నూరిన్ పాత్ర చాలా కీలకం. ఆమె తన గ్లామర్‌తోనూ, పెర్ ఫార్మెన్స్ తోనూ కచ్చితంగా తెలుగు ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టడం ఖాయం. `ఉల్లాలా ఉల్లాలా` రిలీజ్ తర్వాత నూరిన్ తెలుగులో కూడా బిజీ హీరోయిన్ అవుతుంది. ఈ పాత్రకు నూరిన్ అయితే బాగుంటుందని చెప్పగానే, మా నిర్మాత గురురాజ్ వెంటనే ఆమెతో మాట్లాడి ఒప్పించారు. ఈ సినిమాలో కనిపించే పాత్రలు... నిజమైనవి కావు. వాళ్లు మనుషులా అంటే దెయ్యాలు. దెయ్యాలా? అంటే మనుషులు. దెయ్యాలా? మనుషులా? అంటే ఎవరూ కారు. మా చిత్రంలో ఉన్నది లేదు... లేనిదే ఉన్నట్టు`` అని చెప్పారు.
నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ ``మా బేనర్లో `రక్షకభటుడు`, `ఆనందం మళ్లీ మొదలైంది`, `లవర్స్ డే` చిత్రాల తర్వాత వస్తున్న సినిమా `ఉల్లాలా ఉల్లాలా`. ఇలాంటి కాన్సెప్ట్ లు చాలా అరుదుగా వస్తుంటాయి. సత్యప్రకాశ్‌కి నటునిగా ఎంత పేరుందో, దర్శకునిగా అంతకన్నా ఎక్కువ పేరు ఈ చిత్రం ద్వారా వస్తుందని నమ్ముతున్నాను`` అని తెలిపారు.
కథానాయిక నూరిన్ మాట్లాడుతూ ``తెలుగులో నాకు చాలా అవకాశాలు వచ్చినా, ఈ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాను. నా పాత్ర క్లాస్‌కు, మాస్కూ నచ్చుతుంది. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను`` అని చెప్పారు.
తారాగణం:
నటరాజ్, నూరిన్, అంకిత, గురురాజ్, సత్యప్రకాష్, `బాహుబలి` ప్రభాకర్, పృథ్వీరాజ్, `అదుర్స్` రఘు, జబర్ధస్త్ నవీన్, లోబో, మధు, జబర్ధస్త్ అప్పారావు, రాజమౌళి, జ్యోతి, గీతాసింగ్, జయవాణి తదితరులు
సాంకేతిక నిపుణులు:
సమర్పణ: శ్రీమతి ఎ.ముత్తమ్మ,
ఛాయాగ్రహణం: జె.జి.కృష్ణ, దీపక్,
సంగీతం: జాయ్,
ఎడిటింగ్: ఉద్ధవ్,
నృత్య దర్శకత్వం: శేఖర్ మాస్టర్, దిలీప్ కుమార్,
యాక్షన్: డ్రాగన్ ప్రకాష్,
ఆర్ట్: కె.మురళీధర్,
పాటలు: కాసర్ల శ్యామ్, గురుచరణ్,
కథ - నిర్మాత: ఎ.గురురాజ్,
స్క్రీన్‌ప్లే - మాటలు - దర్శకత్వం: సత్యప్రకాష్.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







