మస్కట్‌లో మల్టీ స్పెషాలిటీ క్లినిక్‌ ప్రారంభం

- September 23, 2019 , by Maagulf
మస్కట్‌లో మల్టీ స్పెషాలిటీ క్లినిక్‌ ప్రారంభం

మస్కట్‌:అల్‌ ఖౌద్‌ పరిసరాల్లో నివసిస్తున్నవారి కోసం మస్కట్‌ ప్రావిన్స్‌ హాస్పిటల్‌ (ఎంపిహెచ్‌) ప్రారంభమయ్యింది. ఈ ఏరియాలో ఇది కొత్త మల్టీ స్పెషాలిటీ ఫ్యామిలీ క్లీనిక్‌ అని అధికారులు పేర్కొంటున్నారు. అల్‌ ఖౌద్‌లోని మజూన్‌ స్ట్రీట్‌లో అందరికీ అనువుగా వుండేలా దీన్ని తీర్చిదిద్దారు. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ - ప్లానింగ్‌ ఎఫైర్స్‌ అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ అలి బిన్‌ తలిబ్‌ అల్‌ హినాయ్‌ ఈ క్లినిక్‌ని ప్రారంభించారు. ఇంటర్నల్‌ మెడిసిన్‌, గైనకాలజీ, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, డెంటల్‌, కాస్మోటాలజీ, ఇఎన్‌టి వంటి విభాగాలు ఇక్కడ అందుబాటులో వుంటాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ క్లినిక్స్‌ పనిచేస్తాయి. అన్ని ప్రముఖ ఇన్సూరెన్స్‌ సౌకర్యాలూ ఇక్కడ సులువుగా అందుబాటులో వుంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com