టిటిడి నూత‌న ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారం

- September 23, 2019 , by Maagulf
టిటిడి నూత‌న ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారం
తిరుమల:నూత‌నంగా ఏర్పడిన టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులు తిరుమల శ్రీ‌వారి ఆలయంలో సోమ‌వారం ఉద‌యం 9.00 నుండి 10.30 గంట‌ల మ‌ధ్య ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఎక్స్-అఫిషియో సభ్యులైన ఎపి ప్రభుత్వ ప్ర‌త్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్‌, టిటిడి  అనిల్ కుమార్ సింఘాల్, ఎండోమెంట్స్ కమిషనర్  పద్మజ ప్రమాణ స్వీకారం చేశారు. అనంత‌రం ఇందులో  నూత‌న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి, బి.పార్థ‌సార‌థిరెడ్డి, పి.ప్ర‌తాప్ రెడ్డి,  నిచితా, కె.పార్థ‌సార‌థి, ముర‌ళీకృష్ణ‌, ఎన్‌.శ్రీ‌నివాస‌న్‌, జె.రామేశ్వ‌ర‌రావు, ఎన్‌.సుబ్బారావు, జి.వెంక‌ట‌భాస్క‌ర్‌రావు,  డి.దామోద‌ర్‌రావు,  ఎంఎస్‌.శివ‌శంక‌ర‌న్‌,  కుమార‌గురు,  సి.ప్ర‌సాద్‌కుమార్‌, ఎమ్‌. రాములు, కె.శివ‌కుమార్, యువి.ర‌మ‌ణ‌మూర్తి రాజులు ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం గరుడాళ్వార్‌ సన్నిధిలో పాలకమండలి సభ్యులతో టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా ముగ్గురు స‌భ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేసిన విష‌యం విదిత‌మే. ప్రమాణ స్వీకారం చేసిన 17 మంది సభ్యులలో ఐదుగురు సభ్యులు ఆంగ్లంలో, మిగిలి వారు  తెలుగులో ప్రమాణం చేశారు. అనంత‌రం ప్రమాణ స్వీకారం చేసిన ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులందరినీ టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి  అభినందించారు, శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో గౌర‌వ స‌భ్యుల‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.  తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి  ఎ.వి. ధర్మారెడ్డి రంగనాయకుల మండపంలో బోర్డు సభ్యులందరికీ  శ్రీ‌వారి తీర్థ ప్రసాదాలు, చిత్ర‌ప‌టాన్ని అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
 
 
 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com