వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్: దోహాకి అథ్లెట్స్ రాక మొదలు
- September 23, 2019
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఐఎఎఫ్) వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ నేపథ్యంలో అథ్లెట్స్, స్పోర్ట్స్ అఫీషియల్స్ రావడం మొదలైంది. ఐదు రోజుల్లో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. 209 దేశాలకు చెందిన 2,000 మందికి పైగా అథ్లెట్స్ ఈ పోటీల్లో పాల్గొంటారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6 వరకు ఈ పోటీలు జరుగుతాయి. కాగా, ఖతార్ అధికార యంత్రాంగం ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. ట్రాఫిక్, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ యూనిట్స్, అథ్లెట్స్‌కి, వారి సహాయకులకి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పోటీల కోసం వచ్చే అథ్లెట్స్ కోసం ప్రత్యేకంగా కౌంటర్లను హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఏర్పాటు చేశారు. భద్రత పరంగా కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







