గల్ఫ్‌కు దూరంగా వుండండి-ఇరాన్ అధ్యక్షుడు
- September 25, 2019
టెహ్రాన్ : పర్షియన్ గల్ఫ్‌కు పశ్చిమ దేశాలు దూరంగా వుండాలని, దాని భద్రతను ఇరాన్ నేతృత్వంలోని ఆ ప్రాంత దేశాలకు వదిలిపెట్టాలని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ హితవు పలికారు. గల్ఫ్ ప్రాంతీయ జలాలలో అమెరికా నేతృత్వంలోని కూటమి పెట్రోలింగ్ కార్యకలాపాలు చేపట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇరాన్ సైనిక సత్తాను ప్రపంచానికి చాటేందుకు దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో కవాతులు నిర్వహించారు. రాజధాని టెహ్రాన్‌లో జరిగిన ప్రధాన కవాతులో రౌహాని రక్షణబలగాలనుద్దేశించి ప్రసంగిస్తూ ఐరాస ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న ఉన్నత స్థాయి సమావేశాలలో గల్ఫ్ శాంతి పునరుద్ధరణ కోసం రూపొందించిన ప్రణాళికను ప్రకటించనున్నట్లు చెప్పారు. సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై ఇటీవలి డ్రోన్ దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న సమయంలో రౌహానీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల ఈ ప్రాంతంలో జరిగిన ఘటనలను ఇరాన్‌తో ముడిపెడుతున్న వారు గతంలో మాదిరిగానే అబద్ధాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







