నటుడు వేణుమాధవ్ కన్నుమూత

- September 25, 2019 , by Maagulf
నటుడు వేణుమాధవ్ కన్నుమూత

ప్రముఖ సినీ నటుడు వేణు మాధవ్ కన్నుమూశారు. ఈ నెల 6 నుంచి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో.. మంగళవారం ఆయన ఆరోగ్యం విషమించింది. సమాచారం అందుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి జీవిత రాజశేఖర్‌తో పాటు ఉత్తేజ్, మా కార్యవర్గ సభ్యుడు సురేశ్ కొండేటి, టాలీవుడ్‌కు చెందిన పలువురు కమెడియన్స్‌ హాస్పిటల్‌లో వేణుమాధవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం ఇవాళ మరింత విషమించి.. మధ్యాహ్నం 12.21 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

ఇతని స్వస్థలం సూర్యాపేట జిల్లా కోదాడ. 1997లో సంప్రదాయం సినిమాతో చిత్ర సీమకు పరిచయం అయ్యారు. తొలి ప్రేమ సినిమాతో ఆయన మంచి గుర్తింపు వచ్చింది. హంగామా, భూ కైలాస్, ప్రేమాభిషేకం చిత్రాల్లో హీరోగా నటించారు. ఇతను చనిపోయినట్లు సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం వదంతులు వ్యాపించాయి. కోదాడలో జన్మించిన వేణుమాదవ్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా, హాస్యనటుడిగా, కథానాయకుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.

కాలేయం, కిడ్నీ సంబంధించిన సమస్యలకు చికిత్స తీసుకుంటున్నారు. కిడ్నీ సమస్య తీవ్రం కావడంతో హాస్పిటల్‌లో చేర్పించారు కుటుంబసభ్యులు. వెంటిలేటర్ సాయంతో ఆయనకు చికిత్స అందించారు వైద్యులు. కొన్నాళ్ల క్రితం ఆయన ఆరోగ్యం బాలేదని వచ్చిన వార్తలపై స్వయంగా స్పందించి పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ప్రకటించారు వేణు మాధవ్. ఆయన మృతిపై సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన వారు సంతాపం ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com