గల్ఫ్‌కు దూరంగా వుండండి-ఇరాన్‌ అధ్యక్షుడు

- September 25, 2019 , by Maagulf
గల్ఫ్‌కు దూరంగా వుండండి-ఇరాన్‌ అధ్యక్షుడు

టెహ్రాన్‌ : పర్షియన్‌ గల్ఫ్‌కు పశ్చిమ దేశాలు దూరంగా వుండాలని, దాని భద్రతను ఇరాన్‌ నేతృత్వంలోని ఆ ప్రాంత దేశాలకు వదిలిపెట్టాలని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ హితవు పలికారు. గల్ఫ్‌ ప్రాంతీయ జలాలలో అమెరికా నేతృత్వంలోని కూటమి పెట్రోలింగ్‌ కార్యకలాపాలు చేపట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇరాన్‌ సైనిక సత్తాను ప్రపంచానికి చాటేందుకు దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో కవాతులు నిర్వహించారు. రాజధాని టెహ్రాన్‌లో జరిగిన ప్రధాన కవాతులో రౌహాని రక్షణబలగాలనుద్దేశించి ప్రసంగిస్తూ ఐరాస ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న ఉన్నత స్థాయి సమావేశాలలో గల్ఫ్‌ శాంతి పునరుద్ధరణ కోసం రూపొందించిన ప్రణాళికను ప్రకటించనున్నట్లు చెప్పారు. సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై ఇటీవలి డ్రోన్‌ దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న సమయంలో రౌహానీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల ఈ ప్రాంతంలో జరిగిన ఘటనలను ఇరాన్‌తో ముడిపెడుతున్న వారు గతంలో మాదిరిగానే అబద్ధాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com