సబ్జాలతో మేలు

- September 26, 2019 , by Maagulf
సబ్జాలతో మేలు

అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే సబ్జాను నీళ్లలో నానబెట్టి తాగండి. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయోటిక్ లా పనిచేస్తుంది. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలనూ నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల తెల్లవారేసరికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్-2 మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. అంతేకాదు..దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్ రాకుండా చూడడంతోపాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది. శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జా గింజలు పెట్టింది పేరు. ఇంకా ఈ సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోపాటు పీచునీ ఎక్కువగా కలిగివుంటాయి. ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్, నియాసిన్, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్ 'ఇ' ఉంటుంది. శరీరంలో పేరుకున్న వ్యర్ధాలను తొలగించడానికి ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరింకేం..ఇప్పుడే ఒక గ్లాసుడు సబ్జాలను నాబెట్టండి..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com