ఐఎస్ఎస్లో వీడియో రికార్డింగ్ చేసిన యూఏఈ ఆస్ట్రోనాట్
- September 28, 2019
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్లో రెండో రోజు ఎమిరేటీ ఆస్ట్రోనాట్ హజ్జా అల్ మన్సూరి, గంటపాటు వీడియో రికార్డ్ చేశారు. మాస్కో, దుబాయ్ మరియు హూస్టన్‌లోని గ్రౌండ్ స్టేషన్స్‌తో తమ బృందంతో కలిసి కమ్యూనికేట్ చేశారు. మరోపక్క, రెండు లైవ్ సెషన్స్ కూడా నిర్వహించారు. ఒకటి వీడియో, ఇంకొకటి రేడియో సెషన్ వున్నాయి ఇందులో. అల్ మన్సూరి, స్కూల్ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు ఐఎస్ఎస్ నుంచే. ఈ మేరకు నాసా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాకెట్ పైకి వెళుతున్న సమయంలో అనుభవాల గురించి మన్సూరిని విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. కాగా, వీడియో రికార్డింగ్‌తోపాటు, డెయిరీని 15 నిమిషాల పాటు రికార్డ్ చేసుకున్నారు. ఫ్లూయిడ్స్‌పై అల్ మన్సూరి ప్రయోగాలు చేశారు. మరోపక్క అల్ మన్సూరి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు డాక్టర్ అల్ సువైది (ఫ్లైట్ సర్జన్). యూఏఈ ఫ్లాగ్‌ని అల్ మన్సూరి తనతోపాటు అంతరిక్షంలోకి తీసుకెళ్ళిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







