'భాగ్యనగర వీధుల్లో'ఫస్ట్ లుక్ విడుదల

- September 28, 2019 , by Maagulf
'భాగ్యనగర వీధుల్లో'ఫస్ట్ లుక్ విడుదల

హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస రెడ్డి ఇటీవల హీరోగా పలు చిత్రాలు చేశారు. ఆయన హీరోగా వచ్చిన 'గీతాంజలి'.. 'జయమ్ము నిశ్చయమ్మురా'.. 'ఆనందో బ్రహ్మ' మంచి ఫలితాన్నందుకున్నాయి. అతను అనసూయతో కలిసి నటించిన సచ్చిందిరా గొర్రె అనే సినిమా మేకింగ్ దశలో ఉంది. నటుడిగా బిజీగా ఉంటూనే ఇప్పుడు శ్రీనివాసరెడ్డి ఒకేసారి దర్శక నిర్మాతగా అరంగేట్రం చేస్తుండటం విశేషం. భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు పేరుతో శ్రీనివాస రెడ్డి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కామెడీ ని నమ్ముకొని పైకి వచ్చిన శ్రీనివాస రెడ్డి.. కామెడీ బాక్ డ్రాప్ లోనే ఇప్పుడు తన తదుపరి చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు, సినిమా లో నటిస్తూ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్న శ్రీనివాస రెడ్డి ఇటీవల చిత్ర షూటింగ్ ని విజయవంతం గా పూర్తి చేసి, సినిమా ని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ కి తీసుకొని వచ్చాడు . జయమ్ము నిశ్చయమ్మురాకు రచయితగా పని చేసిన పరమ్ సూర్యంశునే ఈ చిత్రానికి కథతో పాటు స్క్రీన్ ప్లే, మాటలు సమకూరుస్తున్నాడు. ఇందులో షకలక శంకర్, సత్య ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో ముగ్గురు హాస్య నటులు డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇందులో నో యాక్షన్, నో సెంటిమెంట్ ఓన్లీ కామెడీనే ఉంటుందని మేకర్స్ తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com