విశాఖలో రూ.5 వేల కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయనున్న రిలయన్స్
- January 10, 2016
విశాఖపట్నం జిల్లాలోని రాంబిల్లిలో రూ.5 వేల కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ప్రకటించారు. విశాఖపట్నంలో ఆదివారం ప్రారంభమైన సీఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో ఆయన ప్రసంగించారు. రిలయన్స్ గ్రూపు రక్షణ రంగంలో పెట్టుబడులను విస్తరిస్తోందని, అందులో భాగంగా తూర్పు తీరంలో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామన్నారు. దీంతో పాటు రక్షణ రంగానికి అవసరమైన ఇతర పరికరాలు తయారు చేయడానికి మరో రూ.10 వేల కోట్లను దశల వారీగా పెట్టుబడి పెడతామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అనిల్ అంబానీ పారశ్రామిక వేత్తలకు పిలుపు నిచ్చారు. హైదరాబాద్లో బిజినెస్ స్కూల్ చంద్రబాబు హాయాంతోనే ఖ్యాతి పొందిదని అనిల్ అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







