'నిర్మల' మైన విద్యను అందించిన ఈ స్కూల్ కు 50 ఏళ్ళు
- January 10, 2016
మత సామరస్యానికి లౌకిక తత్వానికి కృష్ణాజిల్లా పెట్టింది పేరు. మచిలిపట్నం లో ఓ 50 ఏళ్ళ క్రితం ఓ పాతిక మంది చిన్నారులతో కిండర్ గార్డెన్ చదువును ప్రారంభించిన నిర్మల కాన్వెంట్ హైస్కూల్ నేడు చదువుల్లోనే ఉన్నత శిఖరాన్ని అందుకొంది. విద్యార్ధుల భవిష్యత్ తరగతి గదుల్లోనే నిర్మించ బడుతుందనే బంగారు మాటకు నిజమైన అర్ధం ఈ విద్యాసంస్థను పరికిస్తేనే అవగతమవుతుంది.ఇక్కడ చదువుకున్న వేలాదిమంది విద్యార్ధులు సమాజంలో ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగేరు. వందలాది మంది డాక్టర్లగా, వేలాదిమంది ఇంజీనీర్లుగా, ఉన్నతాధికార్లుగా దేశ విదేశాల్లో తమ అమూల్యమైన సేవలను అందిస్తున్నారు. రాజకీయ నేతలు, మంత్రులు సైతం ఇక్కడ చదువుకున్నవారు నేడు క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ప్రస్తుతం 2 వేలకు పైగా విద్యార్ధినీ విద్యార్ధులతో శోబిల్లుతున్న నిర్మల హైస్కూల్ లో చదువుకోవడం నేటీకీ గొప్ప వరంగా పలువురు భావించడం విశేషం. వెయ్య మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది నిర్మలా కాన్వెంట్ మాతృ సంస్థ ఇటలీ దేశంలోని మిలాన్ నగరంలో ఉంది. జాతి ,కుల, మత ,దెశ, వర్గ, వర్ణ బేధాలు లేకుండా ప్రజలందరికీ క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తూ, దేవుని సజీవ వాక్యాన్ని అందరికి తెలియచెప్పాలనే నిర్మల సిస్టర్ల సిద్దాంతాన్ని అక్షారాల మచిలీపట్టణంలో నేటికీ నెరవేరుస్తున్నారు. కృష్ణాజిల్లాలో వీరు తమ తొలి పాటశాలను అక్టోబర్ 2 వ తేదీ 1948 సంవత్సరం గుడివాడలోప్రారంభించారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం లో నాడు సరైన ఇంగ్లీష్ భోధించే పాటశాల లేకపోవడం, ప్రజల కోరిక ప్రకారం జులై 5 వ తెదే 1966 లో నిరాడంబరంగా ప్రారంభించారు. సిస్టర్ డైసీ అతికాల్ తొలి ప్రధాన ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. ఆనాటి కృష్ణాజిల్లా కలెక్టర్ సి.ఎస్, శాస్త్రి నాటి మచిలీపట్నంలో ఇంగ్లీష్ విద్య అవసరాన్ని గుర్తించి రిజిస్ట్రార్ కార్యాలయం పక్కనే ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిని నిర్మల కాన్వెంట్ కు ఉచితంగా ఇవ్వడంతో చక్కని చదువుల పునాదిని ఏర్పరిచారు. ఆ తర్వాత ప్రధాన ఉపాధ్యాయురాలిగా 1973 లో బాధ్యతలను స్వీకరించిన రెవరెండ్ సిస్టర్ నజారీన కుట్త్యమ్మ కిండర్ గార్డెన్ స్థాయి నుంచి ప్రాథమిక పాటశాలగా మరో మెట్టుకు ఎదిగింది. ఆ తర్వాత నిర్మల హై స్కూల్ గా ప్రభుత్వ గుర్తింపు పొందింది. ఇప్పటకి ఉన్న నిర్మల కాన్వెంట్ హై స్కూల్ భవంతులలో అత్యధికం ఆమె హయంలో నిర్మించినవే.
ఆమె ప్రధాన ఉపాధ్యాయురాలిగా 23 సంవత్సరాలుగా విధులను ఎంతో అంకితబావంతో నిర్వహించారు. నాడు కృష్ణాజిల్లాలో ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయురాలిగా మూడుసార్లు ఎంపికయ్యారు. కాని , ఆమె తన నిరాడంబర వైఖరి కారణంగాఒకే ఒక్కసారి ఆ గౌరవ పురస్కారాన్ని అందుకొన్నారు. కొన్నేళ్ళ క్రితం పదవతరగతి ఉత్తీర్ణత శాతం అతి తక్కువగా ఉండేది.ఆ రోజుల్లనే నిర్మలా హై స్కూల్ 10 వ తరగతి ఫలితాలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణతను సాధించి రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపును సాధించింది.1985 వ సంవత్సరంలో పువ్వాడ వేణుగోపాల్ అనే విద్యార్ధి 10 వ తరగతి లో రాష్ట్రస్థాయిలో 7 వ ర్యాంక్ సాధించారు. విద్య విషయాలలోనే కాక క్రీడలు, ఎన్.సి.సి. , స్కౌట్స్ అండ్ గైడ్స్, కరాటే , కుంగ్ ఫు తదితర విభాగాలలో సైతం నిర్మల హై స్కూల్ విద్యార్ధినీ విద్యార్ధులు తమ తమ ప్రతిభను నలుదిశల చాటేరు. 1988 సంవత్సరంలో మరోమారు ఉత్తమ హైస్కూల్ గా కృష్ణాజిల్లా కలెక్టర్ చేతుల మీదుగా నాటి ప్రధాన ఉపాధ్యాయురాలు సిస్టర్ సిసిలీ గౌరవ పురస్కారాన్ని అందుకొన్నారు. ప్రస్తుతం ప్రధాన ఉపాధ్యాయురాలుగా విధులను నిర్వహిస్తున్న సిస్టర్ జేసింతా వరుకు ఈ విద్యాసంస్థలో విద్యార్ధులు సాధించిన విజయాలను నమోదు చేయాలంటే పేజీలు సరిపోవనేదే అక్షర సత్యం. ఈ స్కూల్లో చదువుకున్న ఎందరో పూ ర్వ విద్యార్ధులు ఎన్నో సామజీక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే న మరెందరో ప్రవాస భారతీయులైన నిర్మల కాన్వెంట్ విద్యార్ధులు స్వదెశానకి వచ్చినపుడల్లా తాము చదువుకున్నతరగతి గదులకు వచ్చి చన్ననాటి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకొంటారు. స్కూల్ అభివృద్ధికి నేటికీ తమ తోడ్పాటును అందించడం విశేషం.
ఈ కార్యక్రమములో పూర్వ విద్యార్ధులు మంత్రి కొల్లు రవీంద్ర, పేర్ని నాని, గొర్రెపాటి శ్రీనివాస్ చంద్,కొల్లూరి శివ, శ్రవణం పవన్,రమేష్,దింటకుర్తి సుబ్బ్రమణ్యం,దేవీప్రసాద్,వర్రె రవి, దేవత శ్రీకాంత్,సామా కిరణ్,రవి,కనక దుర్గ,జ్యోతి, రాధా రాణి,పూర్ణిమ,రామ లక్ష్మి,లక్ష్మి కుమారి,గాయత్రి,ప్రసాద్,నీలిమ,హారతి తదితరులు పాల్గొన్నారు.
యాబైవ ఏట అడుగు పెట్టిన నిర్మల కాన్వెంట్ హై స్కూల్ శత వసంతాలకు పైగా విరాజిల్లాలని " మాగల్ఫ్.కామ్ " కోరుకుంటున్నది.



తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







