జిహాద్ కే ఓటేసిన ఇమ్రాన్ ఖాన్..స్పందించిన భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్
- September 30, 2019
న్యూయార్క్‌లో జరిగిన ఐరాస సదస్సును ముగించుకొని పాకిస్తాన్‌కు చేరుకున్న ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మరోసారి కశ్మీర్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ''కశ్మీరీలు చేస్తోన్న పోరాటం ఓ పవిత్ర యుద్ధం(జిహాద్) అని పేర్కొన్న ఇమ్రాన్ ఖాన్.. అందుకు మద్దతు పలుకుతూ పాకిస్థానీలు చేస్తున్నది కూడా జిహాదే అవుతుందని అన్నారు. ప్రపంచమంతా వ్యతిరేకించినా.. కశ్మీరీలకు అండగా మేముంటాం. కశ్మీరీల వైపు పాకిస్తానీయులు ఉంటే.. ఈ పోరాటంలో విజయం వారినే వరిస్తుంది" అంటూ కశ్మీరీలను, కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్న వారిని ప్రోత్సహించేలా ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించడం గమనార్హం. అమెరికా నుంచి తిరిగొచ్చిన అనంతరం తొలిసారిగా ఆదివారం ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఉగ్రవాదంపై మరోసారి అతడి వైఖరిని బయటపెట్టాయి. ఈ వ్యాఖ్యలను రావత్ తిప్పికొట్టారు.
పాక్‌ను హెచ్చరించిన ఆర్మీ చీఫ్
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హద్దుమీరి మాట్లాడటంపై భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. ఆయన కయ్యానికి కాలుదువ్వే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. దాగుడు మూతలు ఎంతోకాలం సాగవని హెచ్చరించారు. భారత్ అంటే ఏంటో మెరుపుదాడులతోనే సందేశమిచ్చామన్నారు. 'జిహాద్ అనే పేరు చెప్తూ పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. పాక్ హద్దులు మీరుతోంది. ఇక దాగుడు మూతలు ఎన్నో ఏళ్లు సాగవు. అవసరమైతే భారత్ వాయు మార్గం ద్వారా, రోడ్డు మార్గం ద్వారా కచ్చితంగా సరిహద్దులు దాటుతుంది. భారత్‌తో యుద్ధం చేయడమే పాకిస్థాన్ పాలసీగా పెట్టుకున్నట్లుంది. అదే గనుక నిజమైతే ఆ దేశానికి సరైన బుద్ధి చెబుతాం' అని అన్నారు. అంతర్జాతీయ సమాజం మద్దతుతో యుద్ధంలో అణ్వాయుధాలు ఉపయోగిస్తారన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. భారత్‌కు ఆ అవసరం లేదని అణ్వాయుధాలను యుద్ధంలో ఉపయోగించేది లేదని ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశం గురించి మాట్లాడారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







