మూడు నెలలుగా తిండి కూడా పెట్టటంలేదు అంటూ ధర్నాకు దిగిన లాలూ కోడలు
- September 30, 2019
ఆర్జేడీ అధినేత..బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్యా సంచలన ఆరోపణలు చేశారు. తనకు 3 నెలలుగా తిండి పెట్టడం లేదని, వంటింట్లోకి కూడా రానీయని అత్తగారు రబ్రీ దేవి, అడపడుచు మీసాభారతిలపై ఆరోపించారు. లాలూ కుమారుడు తేజ్ దీప్ ప్రసాద్ భార్య ఐశ్వర్యతో విడాకులు కావాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయినా భర్తనుంచి విడిపోవటానికి ఇష్టపడని ఐశ్వర్య మాత్రం వివాహ బంధాన్ని నిలుపుకోవటానికి యత్నించారు. ఈ క్రమంలో విడాకులు కావాలని భర్త అడిగినా..కోర్టులో పిటీషన్ వేసినా ఆమె అత్తిల్లు అయిన రబ్రీ దేవి ఇంటిలోనే ఉంటున్నారు.
అయినా తనను వదిలించుకోవాలని వారు శతవిధాలా యత్నిస్తున్నారనీ..ఇంటిలోనే ఉన్న తనను విడాకులు ఇచ్చేసిన భార్యగా తన భర్త తేజ్ ప్రతాప్,పరాయివ్యక్తిలా తన అత్తా ఆడబిడ్డలు చూస్తున్నారనీ..తనకు తిండి కూడా పెట్టకుండా వేధిస్తున్నారని..లాలూ ప్రసాద్‌యాదవ్ ఇంటి దగ్గర ఆదివారం (సెప్టెంబర్ 29)న ప్రెస్ మీట్ లో ఐశ్వర్య ఆవేదన వ్యక్తంచేశారు. తేజ్ ప్రతాప్ తన భార్య ఐశ్వర్య విడాకుల కేసు కొనసాగుతున్న క్రమంలో ఆమె మొదటిసారి నోరు విప్పి అత్తింటివారిపై సంచలన ఆరోపణలు చేశారు.తనను తీవ్రంగా వేధిస్తున్నారంటూ మహిళా హెల్ప్ లైన్‌కు ఫోన్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకిదిగారు. తన తండ్రి చంద్రికా రాయ్‌తో కలిసి ఐశ్వర్య లాలూ ప్రసాద్ అవుట్ హౌస్ లో ధర్నా చేపట్టారు.
అత్తగారు రబ్రీదేవి, ఆడపడుచు మీసా భారతికి తానంటే మొదటి నుంచీ ఇష్టం లేదని, పెళ్లైన నాటి నుంచి తనను వివక్షగానే చూస్తున్నారనీ..మూడు నెలల నుంచి తనకు తిండి పెట్టట్లేదని..వంట గది తాళాలు వేసుకుంటున్నారనీ..కనీసం తాగటానికి మంచి నీళ్లు కూడా ఇవ్వట్లేదని ఆమె తీవ్ర ఆవేదనతో తెలిపింది.మూడు నెలలుగా పుట్టింటివాళ్లు పంపే భోజనంతోనే కడుపునింపుకుంటున్నానని తనను ఎలాగైనా సరే ఇంటి నుంచి గెంటివేయటానికి ఎంతగానో యత్నిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.
ఇంట్లో నా పరిస్థితి ఇలా ఉందని తెలిపేందుకు తాను వీడియో తీయబోతే అత్త రబ్రీదేవి బాడీ గార్డు తన ఫోన్ లాక్కునేందుకు యత్నించాడనీ చెప్పారు. కాగా ఐశ్వర్య ప్రెస్ మీట్ జరుగుతున్నంత సేపు లాలూ కుటుంబ సభ్యులు ఎవ్వరూ బైటకే రాలేదు. తన భర్తగానీ..తన మరిది తేజస్వీ గానీ తనను వ్యక్తిగతంలో ఇబ్బంది పెట్టలేదనీ..అత్తా ఆడపడుచుల వల్లనే తనకు ఇంట్లో పెద్ద సమస్యగా ఉందని అన్నారు. కాగా బీహార్ లో జరగనున్న బై ఎలక్షలకు లాలూ కుమారులు తేజ్ ప్రతాప్, తేజస్వీ బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







