సౌదీ హెరిటేజ్ మ్యూజియం ప్రారంభం
- September 30, 2019
అల్ఖోబార్: అబ్దుల్లా బిన్ మొహమ్మద్ అబాబ్తైన్ హెరిటేజ్ మ్యూజియం, సుల్తన్ బిన్ అబ్దుల్ అజీజ్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (సైటెక్)తో కలిసి హెరిటేజ్ ఎగ్జిబిషన్‌ని, సౌదీ నేషనల్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా ప్రారంభించడం జరిగింది. కింగ్ ఫహాద్ యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ మినరల్స్ ప్రెసిడెంట్ డాక్టర్ సహల్ అబ్దుల్ జవాద్ సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. సీ లైఫ్, డైవింగ్‌కి సంబంధించి చాలా అంశాలు ఈ మ్యూజియంలో పొందుపర్చారు. హెరిటేజ్ వెపన్స్ ప్రదర్శన కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు జరిగాయి. ఫోల్క్లోర్, ప్రాచీన కాల ఉపకరణాలు, ఇస్లామిక్ కరెన్సీ వంటివి కూడా పొందుపర్చడం జరిగింది. మ్యూజియం సూపర్వైజర్ మొహ్మద్ అబాబ్తైన్ మాట్లాడుతూ, చరిత్రకీ వర్తమానానికీ వారధిలా ఈ మ్యూజియంని ఏర్పాటు చేశామని అన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







