డ్రోన్ల ద్వారా పాక్ నుండి భారత్‌కు తుపాకుల అక్రమ రవాణ

- October 02, 2019 , by Maagulf
డ్రోన్ల ద్వారా పాక్ నుండి భారత్‌కు తుపాకుల అక్రమ రవాణ

న్యూఢిల్లీ : పాకిస్థాన్ దేశం నుంచి అక్రమంగా తుపాకులను సరిహద్దుల్లో ఉన్న పంజాబ్ రాష్ట్రానికి డ్రోన్ల ద్వార అక్రమంగా చేరవేస్తున్నట్లు పంజాబ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. పంజాబ్ పోలీసులు మరో ఖలిస్థానీ ఉగ్రవాదిని బుధవారం నాడు అమృతసర్ నగరంలో అరెస్టు చేశారు. పాకిస్థాన్ దేశం నుంచి ఉగ్రవాదుల కోసం డ్రోన్ల ద్వార తుపాకులను రహస్యంగా చేరవేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావడంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది. ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్ కు చెందిన సాజన్ ప్రీత్ అనే ఉగ్రవాదిని పంజాబ్ ప్రత్యేక పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అమృతసర్ నగరంలోని ఖల్సా కళాశాల నుంచి సాజన్ ప్రీత్ ను అరెస్టు చేశారు. పాకిస్థాన్ దేశం నుంచి తాజాగా డ్రోన్ ద్వార రెండు పిస్టళ్లను తెప్పించారని సమాచారం. పాక్ డ్రోన్ ను ధ్వంసం చేసి రెండు తుపాకులను విక్రయించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గత వారం పంజాబ్ పోలీసులు పాక్ దేశానికి చెందిన రెండు డ్రోన్లను పంజాబ్ సరిహద్దుల్లో స్వాధీనం చేసుకున్నారు. జబల్ పట్టణంలోని తరన్ తరణ్ ప్రాంతంలో దహనమై ఉన్న పాక్ డ్రోన్ కనిపించింది. తుపాకుల అక్రమ రవాణా కోసం పాక్ పెద్ద డ్రోన్లను కూడా వినియోగిస్తుందని హోంమంత్రిత్వశాఖ దర్యాప్తులో తేలింది. ఖలిస్థాన్ ఉగ్రవాదులు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు సహకరిస్తున్నారని తేలడంతో ఎన్ఐఏ రంగంలోకి దిగి తుపాకుల అక్రమ రవాణ బాగోతంపై దర్యాప్తు చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com