భూమికి తిరిగిరానున్న యూఏఈ తొలి ఆస్ట్రోనాట్‌

- October 02, 2019 , by Maagulf
భూమికి తిరిగిరానున్న యూఏఈ తొలి ఆస్ట్రోనాట్‌

యూఏఈ తొలి ఆస్ట్రోనాట్‌ హజ్జా అల్‌మన్సూరి, విజయవంతంగా అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకుని భూమికి తిరిగిరానున్నారు. అక్టోబర్‌ 3 మధ్యాహ్నం 2.59 నిమిషాలకు (యూఏఈ టైమ్‌) హజ్జా అల్‌ మన్సూరి భూమికి చేరుకుంటారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి అక్కడే వారం రోజులపాటు అనేక ప్రయోగాలు నిర్వహించారు హజ్జా. సోయజ్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌కి సంబంధించిన మాడ్యూల్‌ ద్వారా హజ్జాతోపాటు ఆన్‌బోర్డ్‌ సభ్యులు భూమికి చేరుకుంటారు. అనంతరం వారిని హెలికాప్టర్‌ ద్వారా కరంగద సిటీకి తరలిస్తారు. అక్కడి నుంచి వారిని మాస్కోకి పంపిస్తారు. వైద్య పరీక్షల అనంతరం.. ఆస్ట్రోనాట్స్‌ తమ తమ స్వస్థలాలకు చేరుకోనున్నారని అధికారులు వివరించారు. అల్‌మన్సూరితోపాటు నాసా ఆస్ట్రోనాట్‌ నిక్‌ హేగ్‌, రష్యన్‌ కాస్మోనాట్‌ అలెక్సీ ఓవచినిన్‌ భూమికి తిరిగి వస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com