యుఏఈ కార్మిక చట్టం: వారంలో 48 గంటలు.. ఓవర్ టైమ్
- January 10, 2016యుఏఈ లో పని సమయాన్ని వారానికి 48 గంటలుగా నిర్ధారించారు. అదనపు చెల్లింపులు లేకుండా, అదనపు సమయం పని చేయించుకుంటే అది నిబంధనల్ని ఉల్లంఘించినట్లవుతుందని కార్మిక మంత్రిత్వ శాఖ అధికారి వెల్లడించారు. దుబాయ్‌లోని మంత్రిత్వ శాఖకు చెందిన లేబర్ రిలేషన్స్ డైరెక్టర్ మహమ్మద్ ముబారక్ మాట్లాడుతూ, యజమాని అదనపు సమయాన్ని కార్మికులతో పని కోసం వినియోగించుకుంటే, మరుసటి వారంలో దానికి తగ్గట్టుగా మినహాయింపులు ఇవ్వాలని చెప్పారు. ఐదు గంటల పాటు నిర్విరామంగా పని చేసిన అనంతరం, గంట పాటు విరామం పొందే హక్కు కార్మికులకు ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం రోజుకు ఎనిమిది గంటలు, వారంలో ఆరు రోజులు పనిదినాలు. వారంలో 48 గంటల కంటే ఎక్కువ సమయం కార్మికులతో పని చేయించుకుంటే తప్పనిసరిగా అదనంగా కార్మికులకు యజమాని చెల్లించాల్సి ఉంటుంది. యజమాని కార్మికులకు అదనంగా చెల్లింపులు చేసి, వారంతపు సెలవు దినం కూడా పని దినంగా మార్చవచ్చనీ, అయితే కార్మికులపై ఒత్తిడి తెచ్చి, బలవంతంగా రెండు వరుస వారాంతపు సెలవు దినాల్ని పని దినాలుగా మార్చరాదని చట్టంలో పేర్కొన్నారు. కార్మికులకు ఉన్న హక్కుల్ని యజమాని హరించాలని చూస్తే, చట్టాన్ని ఉల్లంఘించినట్లవుతుంది. ఈ సందర్భంలో కార్మికులు, యజమానిపై లేబర్ రిలేషన్స్ ఆఫీస్‌కి ఫిర్యాదు చేయవచ్చు. వారంలో ఏడు రోజులపాటు వరుసగా పనికి డుమ్మా కొడితే, వారిని పనిలోంచి తొలగించే అధికారం యజమానికి లభిస్తుంది. అవసరానికి తగ్గట్టుగా యజమాని అదనపు సమయం పని చేయించుకుంటే, 1.25, 1.50 గంటల కింద లెక్కించాల్సి ఉంటుంది. అయితే 2 గంటలకు మించి ఓవర్ టైమ్ చేయించడానికి వీల్లేదు. సెలవు రోజుల్లో పని చేసినందుకు జీతంతోపాటు, అదనంగా 50 శాతం యజమాని చెల్లించాలి. పని చేసిన రోజుకి అదనంగా ఇంకో రోజు సెలవు ఇవ్వాలి. కార్మికులకు ఏమైనా ఇబ్బందులుంటే కార్మిక శాఖ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. మినిస్ట్రీ ఇన్వెస్టిగేట్ చేసి, కార్మికులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటుంది. యాన్యువల్ లీవ్‌ని కార్మికులు పొడిగించదలచుకుంటే అది ఆబ్సెంట్ కింద పరిగణించబడుతుంది. సరైన కారణం చూపకుండా వరుసగా ఏడు రోజులు పని మానేస్తే, యజమాని ఎలాంటి నోటీసూ ఇవ్వకుండా కాంట్రాక్ట్‌ని రద్దు చేసుకోవచ్చు.
--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







