'దర్బార్' సినిమా షూటింగ్ పూర్తి..
- October 04, 2019
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం దర్బార్ షూటింగ్ పూర్తి చేసుకుంది. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీ డ్యూయర్ రోల్ పోషిస్తుండగా, ఒక పాత్రలో పోలీసు అధికారిగా, మరో పాత్రలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా కనిపించనున్నారు.
ముంబై నేపథ్యంలో సాగే చిత్రం నేటితో చిత్ర షూటింగ్ పూర్తైందని మేకర్స్ తెలియజేశారు. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇక ఈ మూవీ లో రజనీకి జోడిగా నయనతార నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామస్ , మలయాళ నటుడు చెంబన్ వినోద్ జోస్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే యువరాజ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ , విజయ్ సేతుపతి ధర్మదొరైలో నటించిన జీవా అనే ట్రాన్స్‌జెండర్ కీలక పాత్రలు పోషిస్తున్నారట. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







