సముద్రం నుంచి 3 టన్నుల వ్యర్ధాల తొలగింపు
- January 10, 2016
ఎన్విరాన్‌మెంట్ వలంటరీ ఫౌండేషన్‌కి చెందిన కువైట్ డైవ్ టీమ్ (కెడిటి)మూడు టన్నుల వ్యర్ధాల్ని అల్‌సులైబిఖాత్‌లోని ఆఫ్ షోర్ ప్రాంతాల్లో తొలగించింది. కెడిటి ఆపరేషన్స్ ఇన్‌ఛార్జ్ బాలిద్ అల్ షట్టి మాట్లాడుతూ ప్లాస్టిక్ బ్యాగులు, క్యాన్‌లు తీర ప్రాంత పర్యావరణానికి హాని కలిగిస్తాయనీ, పక్షులు, సముద్ర జీవుల మనుగడను ప్రశ్నార్దకం చేస్తాయని చెప్పారు. సముద్రంలో పర్యటించేవారు చెత్తని సముద్రంలో పారేయడం ద్వారా చెత్త పేరుకుపోతుందనీ, అది క్రమంగా తీరానికి చేరుతుందని ఆయన అన్నారు. కువైట్ మున్సిపాలిటీతో కలిసి కెడిటి టీమ్ ఈ క్లీనప్ కార్యక్రమాన్ని చేపట్టింది. సముద్ర పర్యాటకులు, అలాగే సముద్రాల్లోకి వెళ్ళే నౌకలు, ఇతరత్రా పడవలు వంటివాటి ద్వారా చెత్త సముద్రంలోకి వెళ్లకుండా తగిన చర్యలు చేపట్టాలని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడ్డారు. నిబంధనల్ని ఉల్లంఘించినవారికి కఠిన శిక్షలు అమలు చేస్తే, సముద్ర పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుందని అల్‌షట్టి చెప్పారు. సముద్ర పర్యావరణాన్నీ, సముద్ర తీరాన్నీ పర్యవేక్షించగలిగితే సముద్ర జీవులు వృద్ధి చెందుతాయని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







