లేబర్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాం
- January 10, 2016
మినిస్టర్ ఆఫ్ లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ డాక్టర్ అబ్దుల్లా బిన్ సలే అల్ ఖులైఫి మాట్లాడుతూ, కార్మిక చట్టాల్ని కఠినంగా అమలు చేస్తామని, ఖతార్ నేషనల్ డెవలప్‌మెంట్ స్ట్రేటజీలో భాగంగా కార్మిక వ్యవస్థను బలోపేతం చేస్తామని అన్నారు. మినిస్ట్రీ తరఫున 30 మంది ఇన్‌స్పెక్టర్లు పనిచేస్తున్నారని చెప్పారాయన. ఇన్‌స్పెక్టర్ల ట్రెయినింగ్ సెషన్‌లో మినిస్టర్ మాట్లాడారు. అరబ్ లేబర్ ఆర్గనైజేషన్ సహకారంతో ఈ ట్రైనింగ్ సెషన్ జరుగుతుంది. జనవరి 21 వరకు ఈ సెషన్ జరగనుంది. కార్మికుల వేతనానికి సంబంధించి చట్టాలు కఠినంగా అమలు చేయబడ్తాయనీ, తద్వారా చట్టబద్ధమైన వలస కార్మికులకు మేలు జరుగుతుందని మంత్రి అన్నారు. వలస కార్మికులు దేశంలోకి రావడం, వెళ్ళడంలో వెసులుబాట్లు కల్పించేలా చట్టం తీసుకొచ్చామనీ, కార్మిక వ్యవస్థను అది ఇంకా బలోపేతం చేస్తుందని మంత్రి అబ్దుల్లా బిన్ సలే చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







