పెట్టుబడిదారులకు ప్రభుత్వం సువర్ణ అవకాశం..!!
- October 06, 2019
ఇటీవల కాలంలో చాలామంది పెట్టుబడులను బంగారం రూపంలో పెడుతున్నారు. బంగారాన్ని కొనుగోలు చేసి ఇంట్లో స్టాక్ చేసుకుంటూ ఉంటారు. ఇలా బంగారాన్ని కొనుగోలు చేయడం వలన.. ఈ లోహానికి డిమాండ్ పెరిగిపోతున్నది. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. అందుకనే ప్రభుత్వం ఓ కొత్త పధకాన్ని వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది.
బంగారాన్ని పెట్టుబడుల రూపంలో పెట్టాలి అనుకున్నవాళ్లకు ఇది సువర్ణావకాశం అని చెప్పాలి. అదెలా అంటే.. ప్రభుత్వం బంగారాన్ని బాండ్స్ రూపంలో అందిస్తోంది. గ్రామును ఒక యూనిట్ గా నిర్ణయించింది. గ్రాము ధరను రూ. 3,788 గా నిర్ణయించింది. సాధారణ వినియోగదారులు ఇందులో 500 యూనిట్ల వరకు బాండ్లను కొనుగోలు చెయ్యొచ్చు. అదే హిందూ అవిభాజ్య కుటుంబాలైతే 4 కిలోల వరకు, ట్రస్ట్ లైతే 20 కేజీల వరకు బంగారం బాండ్లను కొనుగోలు చెయ్యొచ్చు.
ఇలా పెట్టుబడిని బంగారం బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టడం వలన బంగారం దిగుమతి చేసుకోవడం తగ్గిపోతుంది. ఫలితంగా అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది. బంగారం దిగుమతి తగ్గిపోతే.. డిమాండ్ తగ్గుతుంది. మాములుగా బంగారం కొనుగోలు చేయాలి అనుకున్న వారికి ఈ స్థాయిలో బంగారం రేటు కూడా ఉండదు. రూపాయి బలపడుతుంది. రూపాయి విలువ బలపడితే.. దేశంలో రేట్లు అందుబాటులోకి వస్తాయి.
ఇలా బంగారాన్ని బాండ్ల రూపంలో పెట్టుబడిగా పెట్టుకోవడానికి అక్టోబర్ 7 వ తేదీ నుంచి అక్టోబర్ 11 వరకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. మరి ప్రభుత్వం కల్పించిన ఆ సువర్ణావకాశాన్ని ఏ మేరకు వినియోగదారులు వినియోగించుకుంటారో చూడాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడంతో పాటు డిజిటల్ మార్గంలో చెల్లింపులు చేపట్టే వారికి ప్రభుత్వం గ్రాముకు రూ.50 రాయితీ కల్పిస్తోంది. పెట్టుబడి అవసరాలకు లోహం రూపంలో బంగారం కొనుగోళ్లను తగ్గించేందుకు 2015 నవంబరులో ప్రభుత్వం పసిడి బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







