తాడేపల్లిగూడెంలో మెగాస్టార్ చిరు పర్యటన
- October 06, 2019
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెంలో మెగాస్టార్ చిరంజీవి ప్రర్యటించనున్నారు. ఈ పార్టీఅతనలో భాగంగా చిరు అక్కడి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన 9అడుగుల 3అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని అవిష్కరించనున్నారు. ఎందులో భాగంగా ఉదయం 9.00 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. గన్నవరం విమానాశ్రయంలో చిరంజీవికి వివిధ పార్టీల నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలుకనున్నారు.
చిరు పర్యటన కోసం గన్నవరం విమానాశ్రయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. అక్కడి నుంచి సుమారు 250 కార్లకు పైగా భారీ ర్యాలీతో రోడ్డు మార్గంలో చిరు పర్యటన కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. మార్గమధ్యంలో అక్కడక్కడా అవసరం మేరకు మెగాస్టార్ రోడ్ షో కూడా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ పర్యటన ఈ ఆదివారం ఉదయం 10.30 నుంచి 11.00 గంటల మధ్యలో తాడేపల్లిగూడెం చేరుకోనున్నారు. ఎస్వీ రంగారావు విగ్రహాం ఆవిష్కరిస్తారు. ఈ సందర్బంగా ఆ పక్కనే ఏర్పాటు చేసిన సభావేదికపై చిరంజీవి ప్రసంగించనున్నారు. సమారు 45 నిముషాలకు పైగా చిరు ప్రసంగం సాగనున్నట్టు నిర్వాహకులు పేర్కొంటున్నారు.
12.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 లోగా పర్యటనను ముగించుకుని చిరు తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ సందర్బంగా 120 మంది పోలీసు సిబ్బందితో చిరుకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.ఉంగుటూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలు వట్టి వసంత్, ఈలి నానిలు చిరంజీవికి మధ్యాహ్న భోజన ఏర్పట్లు నిర్వహిస్తున్నారు.నేతలు వడ్డి రఘురామ్, అఖిల భారత చిరంజీవి అధ్యక్షులు రవణం స్వామినాయుడు, భోగిరెడ్డి రాము, సోమలంక శేషు, మారిశెట్టి అజయ్, బండి రామస్వామి తదితరులు విగ్రహవిష్కరణ నుంచి సభాస్థలి వద్ద అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







