బాదంతో ఆరోగ్య ప్రయోజనాలు
- October 07, 2019
బాదం ఆరోగ్యానికి మేలు చేస్తుందనే సంగతి తెలిసిందే. రోజూ క్రమం తప్పకుండా బాదం గింజలు తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. స్నాక్స్‌గా వీటిని తీసుకోవడం బెస్ట్ ఛాయిస్ అని న్యూట్రిషియనిస్టులు చెబుతున్నారు. వీటిలో విటమిన్-ఇ, కాల్షియం, శరీరానికి మేలు చేసే కొవ్వులు, పీచు పదార్థాలు, రైబోప్లోవిన్, మాంగనీస్, కాపర్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి.
రోజూ గుప్పెడు (దాదాపు 23) బాదం గింజలను స్నాక్స్‌గా తీసుకుంటే.. 161 కెలోరీల శక్తి శరీరానికి అందుతుంది. 2.5 గ్రాముల కార్బోహైడ్రేట్స్ అందుతాయి. వీటిలో మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్, ప్రొటీన్లు, ముఖ్య పోషకాలు ఉంటాయి.
బాదం గింజలు యాంటీ ఆక్సిడెంట్లు. కణాలు దెబ్బతినకుండా ఇవి కాపాడతాయి. కణాలు దెబ్బతినడం ద్వారా త్వరగా వృద్ధాప్యం దరి చేరడంతోపాటు జబ్బుల బారిన పడతారు. స్మోకింగ్ చేసేవారు బాదం గింజలు తింటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది.
బాదంలో విటమిన్-ఇ అధిక మోతాదులో ఉంటుంది. గుండె జబ్బులు, కేన్సర్, అల్జీమర్స్ ముప్పు తగ్గడానికి.. విటమిన్-ఇ ఎక్కువగా తీసుకోవడానికి మధ్య సంబంధం ఉందని పరిశోధనల్లో తేలింది.
రక్తంలోని చక్కెర స్థాయిలను బాదం నియంత్రిస్తుంది. వీటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. రక్తంలోని ఎల్డీఎల్ లిపోప్రొటీన్స్‌ను బాదం తగ్గిస్తున్నట్టు పరిశోధనల్లో తేలింది. బాదం తినడం వల్ల ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫలితంగా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







