విక్రమ్ తాజాగా మరో విభిన్నమైన గెటప్ లో..
- January 10, 2016
డిఫరెంట్ రోల్స్ తో తమిళ, తెలుగు సినీ అభిమానులతోపాటు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్త్రీలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు విక్రమ్. 'శివపుత్రుడు', 'అపరిచితుడు', 'నాన్న', 'ఐ' వంటి సినిమాలతో తానేంటో నిరూపించిన విక్రమ్, తాజాగా మరో విభిన్నమైన గెటప్ లో కనిపించబోతున్నాడు. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందనున్న లేటెస్ట్ మూవీలో విక్రమ్ హీరో పాత్రతో పాటు నెగిటివ్ రోల్‌లో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోతోపాటు, విలన్ రోల్ కూడా చేయబోతున్నాడు విక్రమ్. నపుంశకుడు (హిజ్రా)గా కూడా విక్రమ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. నయనతార, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతోంది.తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ డైరెక్షన్. హ్యారిస్ జయరాజ్ సంగీతం. ఇదిలాఉంటే, ఇటీవల వచ్చిన విక్రమ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఐ' అనుకున్నంత సక్సెస్ సాధించకపోగా, తక్కువ బడ్జెట్‌లో విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ '10 ఎంద్రాకుల్ల' కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. సుమారు 85 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ లేటెస్ట్ మూవీ ఆడియన్స్ ని ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







